- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనంతపురంలో పోలీసులు వర్సెస్ లాయర్లు.. ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ లాయర్ శేషాద్రి మృతి అనంతపురంలో రచ్చకు దారి తీసింది. లాయర్ శేషాద్రికి వారం క్రితం స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మృతి చెందారు. అయితే శేషాద్రి మృతికి పోలీసులే కారణమంటూ లాయర్లు ఆరోపించారు. లాయర్ శేషాద్రి సీఐ చాంబర్‌లోనే మృతి చెందారని వ్యాఖ్యానించారు. శేషాద్రి మృతి విషయంలో చాలా అనుమానాలున్నాయని తెలిపారు. శేషాద్రిని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు రాత్రి వేళల్లో పిలిచి కక్షిదారుల ఎదుట అవమానించారంటూ వారం రోజులుగా నిరసన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, పలు ప్రజా సంఘాల నాయకులు అనంతపురంలో శుక్రవారం కూడా ఆందోళన నిర్వహించారు. స్థానిక కోర్టు రోడ్డు నుంచి డీఐజీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యం నశించాలని, శేషాద్రి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. విచారణ పేరుతో లాయర్ శేషాద్రిని బలిగొన్నారని, ఆయన మృతికి కారణం అయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు లాయర్ శేషాద్రికి గుండె పోటుకు వచ్చిందని, ఆస్పత్రికి తరలించేలోపే ఆయన కన్నుమూశారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ విషయంలో అనంతపురంలో పోలీసులు వర్సెస్ లాయర్లుగా పరిస్థితి మారింది.