రక్త జననం, అగ్ని జ్వలనం, విలయ ప్రణయం.. వచ్చేసిన ‘త్రిబాణధారి బార్బరిక్’ టీజర్..

by Kavitha |
రక్త జననం, అగ్ని జ్వలనం, విలయ ప్రణయం.. వచ్చేసిన ‘త్రిబాణధారి బార్బరిక్’ టీజర్..
X

దిశ, సినిమా: స్టార్ నటుడు సత్యరాజ్, డైరెక్టర్ మోహన్ శ్రీవత్స కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిధాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో విశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్ట రాజేంద్ర, ఉదయ్ భాను తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మైథలాజికల్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఇక టీజర్‌ను చూసినట్లయితే.. స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి అని ప్రశాంతంగా స్టార్ట్ అయిన ఈ టీజర్.. రక్త జననం, అగ్ని జ్వలనం, విలయ ప్రణయం, మృత్య పాశం, రక్త సింద్ర, అసుర సంహారం, అగ్ని ద్వారం బార్బరిక్.. అంటూ వైల్డ్ గ్రాఫిక్స్‌తో ఎండ్ అయింది. ప్రస్తుతం ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది.

Advertisement

Next Story

Most Viewed