- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్‌లో మంటలు.. బ్యాటరీ పేలడంతో ప్రమాదం
దిశ, గోదావరిఖని: భారతదేశానికి విద్యుత్ అందిస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సోలార్ విద్యుత్ ప్లాంట్ లో బ్యాటరీ పేలడంతో మంటలు వెలువడ్డాయి. శుక్రవారం ఉదయం సోలార్ విద్యుత్ ప్లాంట్ లో ఒకేసారి పెద్ద ఎత్తున పొగలు రావడంతో ఎన్టిపిసి ఫైర్ సేఫ్టీ అధికారులు ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మంటలను ఆర్పారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ జనరేట్ చేయడానికి ఉపయోగించే బ్యాటరీ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు.
కొంత సమయం సోలార్ విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ అంతరాయం కలిగింది. జనవాసాల మధ్యనే సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉండటంతో స్థానికంగా నివసించే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా ఊరు మధ్యలో ఉన్న రామగుండం సోలార్ ప్లాంట్ ను ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానికులు వాపోతున్నారు. అసలే రామగుండం ప్రాంతంలో దుమ్ము ఎక్కువ ఉండటంతో సోలార్ ప్లాంట్ తో మరింత వేడి వస్తుందని స్థానికులు తెలిపారు.