- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దిశ,వెబ్‌డెస్క్: సావిత్రి బాయి పూలే(Savitri Bai Phule) 194వ జయంతి (జనవరి 3) సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM) ఘన నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని, మహిళల విద్య కోసం ఆమె ఎంతగానో శ్రమించిందని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, వారి చదువు, మెరుగైన జీవితాన్ని అందించేందుకు పూలే దంపతులు ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ.. తన జీవితాన్ని మహిళలకు విద్య అందించడం కోసం, మహిళా సాధికారత కోసం అంకితం చేసిన తొలి భారత మహిళా ఉపాధ్యాయురాలు(First Indian woman teacher), గొప్ప మహిళా సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రి బాయి పూలే అని వ్యాఖ్యానించారు. నేడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయురాలి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.