- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దుండగులు..
దిశ, మీర్ పేట్ : నిర్మాణంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని బీయన్ రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో కొందరు అయ్యప్ప స్వామి మాల ధరించి ప్రతిరోజు నిర్మాణంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజలను నిర్వహిస్తున్నారు.
రోజు మాదిరిగానే గత రాత్రి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సుమారు 11 గంటల తర్వాత దేవాలయం వద్ద నుండి వెళ్లిపోయారు. దేవాలయంలో ఉండే పూజారి, వంట మనిషి, స్వీపర్ అక్కడే నిద్రించారు. ఉదయాన 5 గంటల ప్రాంతంలో లేచి చూసేసరికి దేవాలయంలో టేబుల్ పై ఉన్న తాత్కాలిక విగ్రహాలు కనిపించకపోవడంతో ఎవరో గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారని గుర్తించి దేవాలయ చైర్మన్ కు సమాచారం అందించారు. దేవాలయ చైర్మన్ బొగ్గుల కొండల్ రెడ్డి ఫిర్యాదు మేరకు మీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నామని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు.