ప్రాణాంతక మత్తు పదార్థాలతో కల్తీ కల్లు తయారీ..

by Kalyani |
ప్రాణాంతక మత్తు పదార్థాలతో కల్తీ కల్లు తయారీ..
X

దిశ, హత్నూర : ప్రతి గ్రామంలో పొద్దున్నే లేచి చాయ్ తాగినట్లు గా చాలామంది కల్లు తాగుతున్నారంటే పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు... కల్తీ కల్లును విక్రయిస్తూ. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కొంతమంది వ్యాపారస్తులు పరిశ్రమలో పనిచేసే కార్మికులు, దినసరిగా పనిచేస్తున్న కూలీల కడుపులు కొడుతూ ఇష్టమొచ్చిన తీరులో అడ్డంగా సంపాదిస్తున్నారు.వింత మందులకు అలవాటు చేసి వారి కుటుంబాలను వీధిన పాడేస్తున్నారు.

హత్నూర మండల పరిధిలోని షేర్ ఖాన్ పల్లి. దౌల్తాబాద్, కాసాల, పల్పనూర్, మల్కాపూర హత్నూర, తురకల ఖానాపూర్, నస్తీపూర్, వడ్డేపల్లి, చింతల్ చెరువు, , పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయ., కొందరు కల్లు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా స్వచ్ఛమైన కల్లుకు బదులు వివిధ రకాల ప్రాణాంతక మత్తు పదార్థాలను, కలుపుతూ కృత్రిమ కల్లు ను తయారు చేస్తూ.. గ్రామీణ.. పట్టణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

వచ్చేది కొంత.. తయారయ్యేది కొండంత..

వ్యాపారస్తులు మత్తు కోసం ఇందులో రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. 10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లలో మత్తు కోసం ఆల్ఫా జోల. డైజోఫాం, క్లోరోఫైడ్, తదితర నిషేధిత మత్తు రసాయనాలు కలుపుతున్నారు, 5 శాతం, మేర మాత్రమే స్వచ్ఛమైన కల్లును విక్రయిస్తూనే మిగతా 95 శాతం కల్తీ తయారు చేసి అమ్ముతున్నారు. అంతేకాకుండా అమ్మోనియం, నిద్ర మాత్రం టాబ్లెట్లు, మిశ్రమ రసాయనాలు, సోడియాష్, కుంకుడు కాయ రసం ఇందులో వాడుతున్నారు. దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కళ్లు పోవడం, మెదడు సరిగా పని చేయకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మూత్రపిండాల వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

కల్లుగీత కార్మికులకు లైసెన్స్ ఇవ్వాలి, అయితే కొంతమంది పలుకుబడి ని ఉపయోగించి లైసెన్స్ తీసుకొని ఇతర వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. దీంతో ఆ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఓ కల్లు దుకాణం లైసెన్స్ దారులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటారు. వారు ఈత చెట్లు ద్వారా తెచ్చే స్వచ్ఛమైన కల్లు ను విక్రయించాలి, కానీ వారంతా ఓ గుత్తేదారుడు ఎన్నుకొని అతని వద్ద ఇంతో కొంత ఆ వ్యాపారికి ముట్టబెట్టి అటు మద్యం ప్రియులకు అవసరమైన కల్లు లేకపోవడంతో కృతిమ కల్లును తయారుచేసి ప్రజలకు అలవాటు చేస్తున్నారు. ఆల్ఫా జోలం, డైజోఫాం, క్లోరోహైడ్, తదితర వంటి మత్తు పదార్థాలు కల్లులో కలుపుతూ బానిస చేసి ప్రజల వద్ద ఉన్న డబ్బులను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలవాటు పడిన వ్యక్తి ఒకరోజు తాగకపోయినా పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తుంటారు.

పలు రకాల మత్తు పదార్థాలను ఉపయోగిస్తూ..

జనాన్ని మత్తులో చిత్తు చేసేందుకు కల్లులో అల్ఫాజోలం, డైజోఫామ్‌, క్లోరో హైడ్రేడ్‌ లాంటి ప్రమాదకరమైన మత్తు ప దార్థాలను ఉపయోగిస్తూ వ్యాపారులు కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. గతంలో కల్తీ కల్లు తయారీలో వ్యాపారులు డైజోఫామ్‌ క్లోరోహైడ్రేడ్‌ లాంటి మత్తు పదార్థాలను ఉప యోగించేవారు. వీటి లభ్యత తగ్గడం.. ధర ఎక్కువగా ఉండడంతో ఇటీవలి కాలంలో అల్ఫాజోలం అనే మత్తు మందు ను ఎక్కువగా ఉపయోగించి కల్లును తయారు చేస్తున్నారు. ఈత చెట్ల నుంచి తీసిన కొద్దిపాటి కల్లులో నీళ్లు కలిపి మత్తుమందు కలిపిన అనంతరం తియ్యగా ఉండేందుకు చెక్రీన్‌ పౌడర్‌, పులుపు కోసం ఈస్ట్‌ పౌడర్‌, అందులో నురుగు కోసం కుంకుడు రసం పోస్తున్నారు. మరిన్ని హానికరమైన పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు మండలంలోని పలు గ్రామాల్లో అన్ని కల్లు దుకాణాల్లోనూ కల్తీ కల్లే విక్రయిస్తున్నారు.

కల్లు దుకాణాలపై నిఘా కరువు

మండలంలో కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ శాఖ నిఘా కరువవుతోంది. జోగిపేట్ ప్రాంతాల్లో ఉన్న ఎక్సైజ్‌ సర్కిల్‌ కా ర్యాలయాల అధికారులు కల్లు దుకాణాలలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మాములు’గానే తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు సర్కిల్‌ కార్యాలయాల అధికారులను, సిబ్బందిని అలర్ట్‌ చేసి కల్లు దుకాణాలపై ఎప్పటికప్పుడు దాడులు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed