- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jharkhand BJP : బీజేపీపై ఈసీకి కాంగ్రెస్ రెండో ఫిర్యాదు
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్(Congress) మధ్య వాడివేడి సోషల్ మీడియా వార్ కూడా నడుస్తోంది. ‘జార్ఖండ్ బీజేపీ’(Jharkhand BJP) సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాని(EC)కి ఆదివారం రెండో ఫిర్యాదు చేసింది. ‘‘ఈసారి జార్ఖండ్ బీజేపీ పోస్ట్ చేసిన వీడియోలో మా(కాంగ్రెస్) మిత్రపక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను తప్పుగా చూపించారు. సీఎం హేమంత్ సోరెన్ పాత్రలో ఒక నటుడిని చూపించారు. మైనారిటీలకు మాత్రమే జేఎంఎం మేలు చేస్తోందనేలా ఆ వీడియోలో సందేశం ఉంది. ప్రజలను విభజించేలా బీజేపీ ప్రచారం ఉంది’’ అని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ ప్రస్తావించారు.
‘‘ఇంతకుముందు జార్ఖండ్ బీజేపీ(BJP) పోస్ట్ చేసిన వీడియోలో ఇండియా కూటమిలోని పార్టీలు గిరిజనులకు వ్యతిరేకమనేలా సందేశం ఉంది. మా ఫిర్యాదు ఆధారంగా దానిపై నవంబరు 10న కేసు నమోదైంది. అయినా బీజేపీలో మార్పు రాలేదు’’ అని ఆయన మండిపడ్డారు. ఈసీ ఇప్పటికైనా జోక్యం చేసుకొని జార్ఖండ్ బీజేపీ సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయించాలని కోరారు. బీజేపీ తరఫున తప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు.