- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయవాడలో దారుణం.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆరుగురు దాడి
దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ బస్సు డ్రైవర్(RTC Bus Driver) ఆరుగురు వ్యక్తులు దాడి(Attack) చేసిన ఘటన విజయవాడ(Vijayawada)లో జరిగింది. విజయవాడ బస్డాండ్‌లోకి ఆర్టీసీ బస్సు(RTC bus) వస్తోంది. అయితే ఆ సమయంలో ర్యాంగ్ రూట్‌లో ఇన్నోవా కారు వచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. అయితే తమ కారుకు బస్సు తగిలిందంటూ ఆరుగురు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిడుతూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేశారు. బస్సులోకి వెళ్లి మరీ పిడిగుద్దులు కురిపించారు. అనంతరం పారిపోయేందుకు యత్నించారు. దీంతో ముగ్గురిని స్థానికులు పట్టుకున్నారు. మరో ముగ్గురు పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు కోసం గాలిస్తు్న్నారు. అయితే కారులోని ఆరుగురు వ్యక్తులు మద్యం తాగి ఉన్నారని తోటి డ్రైవర్లు తెలిపారు. ఈ ఘటనతో ఆర్టీసీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.