చలికాలంలో తేనె తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

by Kanadam.Hamsa lekha |
చలికాలంలో తేనె తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!
X

దిశ, ఫీచర్స్: శీతాకాలంలో చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు వంటివి రావడం సర్వసాధారణం. అయితే, వీటన్నింటికి తేనె చెక్ పెడుతుంది. తేనె అనేది ఒక తీపి పదార్థం మాత్రమే కాదు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. చలికాలంలో ప్రతీ రోజు తేనె తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో ముడి తేనెను ఒక స్పూన్ తీసుకోవడం వల్ల చిన్న చిన్న వ్యాధుల నుంచి ఉపశమం కలిగిస్తుంది. అంతేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. చలికాలంలో రోజుకు ఒక స్పూన్ తేనె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చదివేయండి.

యాంటీ బ్యాక్టీరియల్: ఇందులో ఉండే సహజమైన యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్‌ప్లెమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వలన గాయాలు త్వరగా మానిపోతాయి. శరీరానికి హాని కలిగించే వైరస్‌లను తేనె నాశనం చేస్తుంది.

జీర్ణ సమస్యలు: తేనెను రెగ్యులర్‌గా తీసుకుంటే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే శ్వాస సమస్యలు దూరమవుతాయి.

రోగనిరోధక శక్తి: తేనె శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ శరీర కణాలు, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అవ్వకుండా సహాయపడుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

అందానికి: తేనె చర్మాన్ని మాయిశ్చరైజర్‌గా పనిచేసి, మృదువుగా ఉండేలా చేస్తుంది. చలికాలంలో చాలామందికి పెదవులు, ముఖంపై మంట వంటి సమస్యలు వస్తాయి. తేనెను ముఖానికి రాయడం వల్ల ఆ సమస్యలు తగ్గుతుంది. డ్రై స్కిన్‌కి కూడా ఈ తేనె చెక్ పెడుతుంది.

ఎనర్జీని ఇస్తుంది: తేనెలో ఉండే గ్లూకోజ్‌లు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఒత్తిడి, అలసటగా ఉంటే టీలో ఒక స్పూన్ తేనె కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. ఉదయం లేవగానే ఒక స్పూన్ తేనెను తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

నిద్ర సమస్యలు: కొంతమంది నిద్ర సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు గోరువెచ్చని పాలలో తేనెను కలిపి తాగితే, బాడీ రిలాక్స్ అయ్యి హాయిగా నిద్రపడుతుంది.

ముడి తేనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, ఈ తేనెను రెండు స్పూన్ల కంటే ఎక్కువగా తినకూడదు. దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనెను తినిపించకూడదు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed