- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Video Viral:హోలీ వేడుకలు.. ఆ పాటతో డాన్స్ అదరగొట్టిన టీడీపీ ఎమ్మెల్యే!

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హోలీ(Holi) వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. హోలీ అంటేనే రంగులు చల్లుకోవడం, కామదహనం. ఈ తరుణంలో అందరూ తమ ఆత్మీయులతో రంగుల కేళీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తీరొక్క రంగులను చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ హోలీ వేడుకల్లో రంగులు చల్లుకోవడమే కాదు.. వయసుతో సంబంధం లేకుండా చిందులు కూడా వేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ప్రజాప్రతినిధులు సైతం కార్యకర్తలు, ప్రజలతో రంగుల పండుగను కలర్ ఫుల్‌గా నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని అనంతపురం జిల్లా(Ananthapuram District) తాడిపత్రిలో జరిగిన హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ హోలీ వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) జేసీ అస్మిత్ రెడ్డి(JC Asmit Reddy) డాన్స్(Dance)తో అదరగొట్టారు. ‘జై బాలయ్య’ అనే పాటకు స్టెప్పులేసి అందరిలో ఫుల్ జోష్ నింపారు. ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.