Game changer: రేపే లాస్ట్ షెడ్యూల్డ్.. రామ్ చరణ్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

by sudharani |   ( Updated:2024-11-17 14:34:41.0  )
Game changer: రేపే లాస్ట్ షెడ్యూల్డ్.. రామ్ చరణ్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న తాజా సినిమా ‘గేమ్ చేంజర్’ (Game Changer).శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ (Promotions Start) చేసిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ (Latest News) ఒకటి బయటకు వచ్చింది. గేమ్ చేంజర్ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుందని తెలుస్తుండగా.. ఈ చివరి షెడ్యూల్ హైదరాబాద్ (Hyderabad)లో రేపు స్టార్ట్ కానుంది.

సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తోన్న యాక్టర్లు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారని టాక్. ఈ షెడ్యూల్‌తో త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ (Post Production) పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. కాగా.. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు (Dill Raju) నిర్మిస్తుండగా.. నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Read More...

Kanguva: సూర్య ‘కంగువా’ రెండు రోజుల్లో ఎంత ఎంతంటే..?

Advertisement

Next Story

Most Viewed