Bandla Ganesh: పుష్ప-2 ట్రైలర్‌పై బండ్ల గణేష్ రియాక్షన్

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-17 16:29:50.0  )
Bandla Ganesh: పుష్ప-2 ట్రైలర్‌పై బండ్ల గణేష్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2 ట్రైలర్(Pushpa-2 trailer) వచ్చేసింది. ఈ ట్రైలర్‌ను వీక్షించిన ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పుష్ప-2 ట్రైలర్ ఒక మాస్టర్‌పీస్. తన టాలెంట్‌ను మరోసారి అల్లు అర్జున్ చూపించారు. 100 శాతం తన బెస్ట్ ఇచ్చారు. బన్నీ స్టైల్, యాటిట్యూడ్ అండ్ పర్ఫామెన్స్ అన్నీ అద్భుతం. ఇలా ఇంకెవరూ చేయలేరు. నిజంగా అల్లు అర్జున్ ఒక మాస్ కింగ్. తగ్గేదే లే’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

దీంతో బండ్లన్నా అంటూ బన్నీ ఫ్యాన్స్‌ బండ్ల గణేష్‌ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అన్నీ భారీగా హైప్ పెంచేశాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.






Advertisement

Next Story