- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lagacharla : లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలు : కేటీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (G Kishan Reddy) మూసీ (Musi) నిద్రపై కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయం, వారెవా తోడు దొంగల నాటకం అంటూ ఆరోపించారు.
‘కిషన్ రెడ్డి గారూ.. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా? లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర? (Hydraa) హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే.. బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది మేము! రేవంత్‌ను మొదట అభినందించింది మీరైతే.. మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి? ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసం? రేవంత్‌ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు. (Lagacharla) లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ (BJP) పంగానామాలు, మీ పాలి'ట్రిక్స్' ను గమనిస్తోంది తెలంగాణ.. ఆట కట్టిస్తుంది సరైన వేళ’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.