దేశాభివృద్ధికి మూలం అంబేద్కర్ ఆలోచనా విధానమే

by Sridhar Babu |
దేశాభివృద్ధికి మూలం అంబేద్కర్ ఆలోచనా విధానమే
X

దిశ, మేడిపల్లి : ఈ దేశాభివృద్ధికి మూలం అంబేద్కర్ ఆలోచనా విధానమేనని, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. ఆదివారం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ ఆశయ సాధన సమితి అంబేద్కర్ జ్ఞాన మాల 300 వారానికి చేరిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విధానమే ఈ దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, కార్పొరేటర్లు బొమ్మ కళ్యాణ్,చీరాల నర్సింహ, భూక్యా సుమన్ నాయక్, దానగళ్ల యాదగిరి, గుర్రాల వెంకటేష్ యాదవ్, బొమ్మకు రమేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed