PM Narendra Modi: నిజం బయటకు వస్తోంది.. ‘ది సబర్మతి రిపోర్ట్’పై ప్రధాని మోడీ ట్వీట్

by sudharani |   ( Updated:2024-11-23 12:55:41.0  )
PM Narendra Modi: నిజం బయటకు వస్తోంది.. ‘ది సబర్మతి రిపోర్ట్’పై ప్రధాని మోడీ ట్వీట్
X

దిశ, సినిమా: గుజరాత్ (Gujarat)లో జరిగిన గోద్రా రైలు (Godhra Train) దుర్ఘటన, ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’ (The Sabarmati Report). ధీరనజ్ సర్నా (Dheeranaj Sarna) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే (Vikrant Massey), రాశీ కన్నా (Rashi ఖన్నా ), రిద్ధి డోగ్రా (Riddhi Dogra) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. 2002 గోద్రా విషాదం వెనక దాగి ఉన్న నిజాన్ని బహిర్గతం చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) X వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.

ఈ మేరకు ‘నకిలీ కథనం పరిమిత కాలం మాత్రమే కొనసాగుతుంది.. నిజం బయటకు వస్తోంది. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. సినిమా ట్రైలర్ (Trailer)ను తనకు ట్యాగ్ చేస్తూ ఒక నెటిజన్ పెట్టిన పోస్టుపై ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా స్పందించగా.. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా.. 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ (Sabarmati Express) ఎస్-6 కోచ్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టగా.. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.

Advertisement

Next Story