- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPO: స్టాక్ మార్కెట్లో వచ్చే వారం నాలుగు ఐపీఓలు సందడి.. మరో నాలుగు లిస్టింగ్..!
దిశ,వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకులుకు లోనవుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా పబ్లిక్ ఇష్యూలోకి వచ్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. కాగా నవంబర్ మూడో వారంలో కొత్తగా నాలుగు కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీకి రెడీ అయ్యాయి. వీటిలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy), ఎన్విరో ఇన్ ఫ్రా(Enviro Infra) మెయిన్ బోర్డ్ సెగ్మెంట్ నుంచి కాగా.. లామోసాయిక్ ఇండియా(Lamosaic India), సీ2సీ అడ్వాన్స్ సిస్టమ్స్(C2C Advance Systems) ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి రానున్నాయి. వీటి సబ్ స్క్రిప్షన్ వచ్చే వారం ప్రారంభం కానుంది. కాగా గత కొన్ని రోజుల నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూస్తున్న కారణంగా రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్(Rosmerta Digital Services) తన పబ్లిక్ ఇష్యూని వాయిదా వేసుకుంది. ఇదిలా ఉంటే.. మరో నాలుగు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అవ్వనున్నాయి. ఇందులో జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్, ఓనిక్స్ బయోటెక్, మంగళ్ కంఫ్యూషన్, నీలమ్ లెనిన్స్ అండ్ గార్మెంట్స్ కంపెనీలు ఉన్నాయి.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ:
ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ యాజమాన్యంలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ ద్వారా రూ. 10,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ. 102- రూ. 108గా కంపెనీ ఖరారు చేసింది. 138 షేర్లను కలిపి ఒక్కో లాట్ గా నిర్ణయించారు.
ఎన్విరో ఇన్ ఫ్రా:
ఎన్విరో ఇన్ ఫ్రా ఇంజినీర్స్ ఐపీఓ నవంబర్ 13న మొదలై 15న ముగియనుంది. ఐపీఓ ద్వారా రూ. 55 కోట్ల నిధుల్ని సమీకరించాలని యోచిస్తోంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 52 కోట్లను, తాజా షేర్ల విక్రయం ద్వారా రూ. 3 కోట్లను సమీకరించనున్నారు.
లామోసాయిక్ ఇండియా:
రూ. 61.2 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో లామోసాయిక్ ఇండియా ఐపీఓకు రానుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 30.6 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఈ కంపెనీ ఐపీఓ నవంబర్ 21 నుంచి 26 వరకు అందుబాటులో ఉంటుంది.
సీ2సీ అడ్వాన్స్ సిస్టమ్స్:
డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సంస్థ సీ2సీ అడ్వాన్స్ సిస్టమ్స్ ఐపీఓ ద్వారా రూ. 99 కోట్లను సమీకరించనుంది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ. 214- రూ. 226గా సంస్థ నిర్ణయించింది. సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 22న ప్రారంభమై 26న ముగియనుంది.
- Tags
- Stock Market
- IPO