Mahesh Kumar Goud: ‘అక్కడ నువ్వు ప్లాట్ కొనుక్కుంటావా కిషన్ రెడ్డి’

by Gantepaka Srikanth |
Mahesh Kumar Goud: ‘అక్కడ నువ్వు ప్లాట్ కొనుక్కుంటావా కిషన్ రెడ్డి’
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడారు. తమది బుల్డోజర్ పాలన కాదని అన్నారు. యూపీలో కొనసాగుతున్న యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) పాలనే.. బుల్డోజర్ పాలన అని అని ఆరోపించారు. నిజాం కాలంలో మూసీ బోర్డు కూడా ఉండేదని గుర్తుచేశారు. లగచర్ల దాడిలో కేటీఆర్(KTR) ఉన్నాడని స్పష్టమైంది.. కాబట్టే డైవర్ట్ చెయ్యడానికి కిషన్ రెడ్డి బస చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తాము అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే నువ్వు.. ప్లాట్ కొనుక్కుంటావా కిషన్ రెడ్డి అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ బస కార్యక్రమం మొత్తం డ్రామా అని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకే బీజేపీ, బీఆర్ఎస్‌లు కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ఫోకస్ మొత్తం ఫొటో షూట్‌ మీదే ఉందని ఎద్దేవా చేశారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారంటేనే తెలుస్తుందని అక్కడ పరిస్థితి ఎలా ఉందో అని అన్నారు. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని చెప్పారు.

Advertisement

Next Story