- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP : డిసెంబరులో బీజేపీ పాదయాత్రలు
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సలు జరుపుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ(BJP) సిద్ధం అవుతోంది. ఇప్పటికే మూసీ నిర్వసితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ బీజేపీ నేతలు మూసీ(Musi) పరివాహక ప్రాంతాల వాసులతో పాదయాత్ర, భోజనం, నిద్ర వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ నెరవేర్చలేదని.. తదితర ప్రభుత్వ వైఫల్యాలపై పాదయాత్రలు చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. డిసెంబర్ మొదటి వారం నుంచి నియోజక వర్గాల వారీగా బీజేపీ నేతలు పాదయాత్రలు చేపట్టి.. కాంగ్రెస్ అసత్యాలను ప్రజలకు చూపుతామని ప్రకటించింది. కాగా ఈ పాదయాత్ర కార్యక్రమంపై చర్చించేందుకు సోమవారం నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ముఖ్య నేతలంతా సమావేశం అవనున్నారు.
- Tags
- telangana bjp