- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిరుదొడ్డికి డిగ్రీ కాలేజ్ కలేనా?
దిశ, మిరుదొడ్డి : విశాలమైన స్థలంలో సుమారు 15 సంవత్సరాల క్రితం లక్షలు ఖర్చు చేసి డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేపట్టి నాలుగు గదులు నిర్మించి 2010 లో ప్రారంభమైన మిడిదొడ్డి డిగ్రీ కళాశాలలో 150 మందికి పైగా విద్యార్థులు చేరి ఒక బ్యాచ్ పూర్తి చేశారు. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ అందుబాటులో ఉండడంతో ఎంతో సౌకర్యంగా ఉండేది. అంతా బాగానే ఉన్నా పలు కారణాల వల్ల ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ కొనసాగలేదు. ప్రస్తుతం భవనం చుట్టూ ముళ్ళ చెట్లు పిచ్చి మొక్కలతో శిథిలావస్థకు చేరుకుంది.
నీటి మూటలుగా రాజకీయ నాయకుల మాటలు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటి మంత్రి, స్వర్గీయ ముత్యంరెడ్డి మిరుదొడ్డి మండల కేంద్రానికి డిగ్రీ కళాశాల అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి చైర్మన్ గా మాజీ మంత్రి, స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మిరుదొడ్డి గ్రామానికి చెందిన తోట అంజిరెడ్డి, కోశాధికారిగా పన్యాల వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్మల చంద్రం లు సభ్యులుగా వ్యవహరించి లెక్చరర్లకు వేతనాలు, ఇతర ఖర్చులు కమిటీ భరించుకుంది. పలు కారణాల వల్ల 2014 సంవత్సరంలో డిగ్రీ కాలేజీ మూత పడింది.
ప్రత్యేక రాష్ట్రంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి రెండు సార్లు, ఆయన మరణానంతరం, బై ఎలక్షన్లో బీజేపీ నుంచి రఘునందన్ రావు, (ప్రస్తుతం మెదక్ ఎంపీ), ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,(మాజీ మెదక్ ఎంపీ) లు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ నీతోటి మండల కేంద్రానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసి తీరుతామని ప్రతి ఒక్కరూ ఎన్నికల హామీలలో గుప్పించారు. కానీ ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ చోరువ తీసుకోకపోవడం గమనార్హం. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇప్పటికే డిగ్రీ కాలేజీ పేరున 2 ఎకరాల స్థలం కేటాయించి ఉంది. అప్పటి మెదక్ ఎంపీ విజయశంతి, రాజ్యసభ ఎంపీ కేశవరావులు నిధులు కేటాయించారు. ప్రస్తుతం 4 గదులతో నిర్మాణం పూర్తయి ముండ్ల చెట్లు, పిచ్చి మొక్కలతో శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, అధికార పార్టీ నాయకులు చొరవ తీసుకొని మండల కేంద్రానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
డిగ్రీ కాలేజ్ తో విద్యార్థులకు ఎంతో మేలు
మిరుదొడ్డి మండల కేంద్రానికి డిగ్రీ కళాశాల మంజూరు అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో, తెలంగాణ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థిని, విద్యార్థులు డిగ్రీ కాలేజ్ లో చేరే అవకాశం ఉంది. అలాగే చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి ప్రయాణ భారం తగ్గుతుంది.