- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Debit card: డెబిట్ కార్డు లేకపోయినా UPI పిన్ ఇలా సెట్ చేయండి..!!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో డిజిటల్ పేమెంట్స్(Digital payments) ఎక్కువైపోయాయి. కిరాణం షాపుకెళ్లి ఐదు రూపాయలు పే చేయాలన్నా కూడా ఆన్‌లైన్(గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం) ద్వారానే చెల్లిస్తున్నారు. మరొకరికి మనీ పంపాలంటే ఫోన్ నెంబర్ లేదా యూపీఐ ఐడీ(UPI ID) తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనీ ఈజీగా పంపవచ్చు. కాగా యూపీ ట్రాన్సాక్షన్లకు నాలుగు నుంచి ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయాలన్న విషయం తెలిసిందే. ఈ పిక్ సెట్ చేయాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు డెబిట్ కార్డు(Debit card) లేకుండానే యూపీఐ పిన్‌ను సెట్ చేయొచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం..
డెబిట్ కార్డు లేకుండా UPI పిన్‌ను ఎలా సెట్ చేయాలంటే.. మీ యూపీఐ యాప్‌లో ముందుగా మీ అకౌంట్ డిటెయిల్స్ నమోదు చేయండి. ఇప్పుడు యూపీఐ పిన్ సెట్టింట్ ఓపెన్ చేసి.. కనిపిస్తోన్న యూపీఐ పిన్ నె సెట్ చేయండి తర్వాత ఆధార్ సెలెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. పర్మిషన్స్ ను ఓకే చేసి.. ఆధార్ లోని మొదటి ఆరు నెంబర్స్ టైప్ చేయండి. తర్వాత మొబైల్‌కు ఓటీపీ(OTP) వస్తుంది. దీన్ని ఎంటర్ చేశాక.. న్యూ యూపీఐ పిన్ ను క్రియేట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్‌ను పూర్తి చేయడానికి OTPని, మీ UPI పిన్‌ను మళ్లీ నమోదు చేయాలి. ఇలా డెబిట్ కార్డు అవసరం లేకుండా యూపీఐ సెట్ చేసుకోండి. ఇక ఈజీగా ట్రాన్సాక్షన్లు(Transactions) జరపొచ్చు.