మురికి కూపం.. మరమ్మతులు చేయరా..?

by srinivas |
మురికి కూపం.. మరమ్మతులు చేయరా..?
X

దిశ, శంకర్ పల్లి: ఫిరంగి కాలువ మరమ్మతులు చేపట్టకపోవడంతో రోజురోజుకు మురుగు కాలువల తయారైందని పలు గ్రామాల ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్పల్లి మండలం బుల్కాపూర్ నుంచి ప్రారంభమైన ఫిరంగికత్వ మోకిల మీదుగా గోపులారం, దొంతన్ పల్లి , మహారాజ్పేట్, జనవాడ, మిర్జాగూడ మియా ఖాన్ గడ్డ మీదుగా వెళ్లే ఫిరంగి కాలువ అక్కడక్కడ కబ్జాకు గురవడంతోపాటు మరమ్మతులు చేపట్టకపోవడంతో వర్షాకాలంలో వర్షాలు కురిసినప్పుడు నీరు ముందుకు సాఫీగా వెళ్లక ఇళ్లల్లోకి నీరు చేరుతున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఫిరంగి కాలువ పర్యవేక్షణ కొనసాగాల్సి ఉండగా ప్రభుత్వం సంవత్సరాల తరబడి కాలువ మరమ్మత్ కోసం నిధులు మంజూరు చేయకపోవడం అక్కడక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలువను సైతం కబ్జా చేయడం తో నీరు సాఫీగా వెళ్లకుండా ఇళ్లల్లోకి నీరు చేరుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఇటీవల జన్వాడ గ్రామంలోని హరిజనవాడ కిందిబస్తీలో ఫిరంగి కాల్వ ద్వారా నీరు వెళ్లాల్సి ఉండగా సాఫీగా వెళ్లకుండా పలువురు ఇళ్లల్లోకి వెళ్లి రాత్రంతా నిద్రాహారాలు మాని తీవ్ర అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. వర్షాలు కురిసిన సమయంలో నీరు ఇళ్లల్లోకి వచ్చిన వేళ అధికారులు తూతూ మంత్రంగా కాలువను త్రవ్వేసి చేతులు దులుపుకోవడంతో పరిస్థితి మళ్లీ అదే విధంగా తయారయ్యే ప్రమా దం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా కాలువను సర్వే చేసి మీరు సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా రు.

జనవాడ హరిజన బస్తీ వద్ద సుమారు పది ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరిందని , ఆయా గ్రామాలలో మురుగు కాలువల్లో నుంచి వచ్చే నీరంతటిని ఫిరంగి కాలువలోకి వదిలేయడంతో ఫిరంగి కాలువ రూపురేఖలు కూడా మారిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఈ కాలువ ద్వారా నీరు ప్రవహించాల్సి ఉండగా అందుకు ప్రత్యామ్నాయంగా అక్కడక్కడ కాలువలో మురుగునీరు మాత్రమే దర్శనమిస్తోందని, ఇది మురుగు కాలువ నా? వర్షపు నీరు వెళ్లాల్సిన మరుగు కాలవన అనేది అధికారులు స్పష్టం చేయాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం వర్షాలు కురిసిన సమ యంలో హడావుడి చేసే అధికారులు తదనంతరం కాలువ మరమ్మతు గురించి పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story