- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ గ్రామంలో 20 రోజులుగా తాగునీటి సరఫరా బంద్..
దిశ, ఇబ్రహీంపట్నం : రాయపోల్ గ్రామంలో గత 20 రోజులుగా మంచి నీటి సరఫరా ఆగిపోవడంతో ట్యాంకర్లతో నీరు పోయించుకుంటున్న గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో గత 20 రోజులుగా మంచినీటి సరఫరా ఆగిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామ ప్రజలు రూపాయలు 700 నుంచి 800 వరకు డబ్బులు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనడం జరుగుతుంది.
ఈ విషయంపై మాజీ సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి, గ్రామస్తుడు డొంకని కుమార్ గౌడ్ లు బుధవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, గ్రామ ప్రత్యేక అధికారి వెంకటమ్మ కు తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బల్వంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 20 రోజుల నుండి మంచినీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు వెంటనే స్పందించి తాగునీటి ఇక్కట్లు లేకుండా తాగునీటి సమస్యను పరిష్కరించాలని తెలిపారు.