రోడ్డు అంతా గుంతలమయం… ప్రమాదాలకు నిలయం

by Kalyani |   ( Updated:2024-12-27 11:54:01.0  )
రోడ్డు అంతా గుంతలమయం… ప్రమాదాలకు నిలయం
X

దిశ, మోమిన్ పేట్ : మోమిన్ పెట్ మండల్ కేంద్రంలో కార్తికేయ కంపెనీ దగ్గర రోడ్డు అంతా గుంతలు గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా కొనసాగుతుందని అన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు గుంతల మయంగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఫోర్ వీలర్ వాహనాలు రోడ్డుపై ప్రయాణం చేసినప్పుడు గుంతలు కనిపించకపోవడంతో వాహనాలు గుంతల పడి అదుపు తప్పి కింద పడి వాహనదారులు ప్రమాదాలకు గురి ఐ హాస్పిటల్ పాలు అవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యమే కారణమని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారులు పట్టించుకోని గుంతల పడ్డ దగ్గర బాగు చేయాలని గ్రామ ప్రజలు వాహనదారులు కోరారు.

Advertisement

Next Story

Most Viewed