- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహా పిరమిడ్ పిలుస్తోంది..
దిశ, ఆమనగల్లు::- ప్రపంచ ప్రసిద్ధ మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మహా యాగము-3 వేడుకలకు ముస్తాబవుతుంది. కడ్తాల మండలం అనుమాస్ పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ ఆఫ్ ఇండియా, పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా యాగము-3 వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21 నుంచి 31వరకు పత్రీజీ ధ్యాన మహా యాగం వేడుకలు కొనసాగుతాయి. ప్రతిరోజు లక్ష మంది ధ్యానులతో నిర్వహించే వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మికవేత్తలు భారీ ఎత్తున రానున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధ్యానులకు ప్రతిరోజు లక్ష మంది భోజనం చేసేలా ఏర్పాటు కల్పిస్తున్నారు. సరస్వతీ ప్రాంగణంలో ఒకేసారి 30 వేల మంది సామూహిక ధ్యానము చేసుకునేలా వేదికను ఏర్పాటు చేస్తున్నారు.
ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం
32,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 113.6 మీటర్ల ఎత్తుగా 6 వేలకు పైగా ధ్యానులు ఒకేసారి ధ్యానము చేసేందుకు వీలుగా బండ రాళ్లు, ఇనుముతో నిర్మించారు. పిరమిడ్ నలువైపులా పచ్చని చెట్లతో అందంగా ముస్తాబు చేస్తారు. ఈ నిర్మాణము ఒక అద్భుతమని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు గతంలోనే గుర్తించి రికార్డు అందజేశారు. పిరమిడ్ మధ్యలో కింగ్ చాంబర్ పాటు క్వీన్ ఛాంబర్ ఉన్నాయి. కింగ్ చాంబర్ పై 500 మంది వరకు, క్విన్ ఛాంబర్ పై 250 మంది వరకు ధ్యానము చేయవచ్చు.పిరమిడ్ లో ధ్యానము చేస్తే ప్రాణశక్తి మూడు రెట్లు అధికంగా శరీరంలోకి ప్రవేశిస్తుందని ధ్యానుల నమ్మకం. వలంటీర్ల నియామకం ధ్యానులకు సేవలు అందించేందుకు వాలంటీర్లను, పిరమిడ్ పరిసరాలలో వైద్య సేవల కోసం ప్రత్యేక వైద్య శిబిరము, చిన్న పిల్లల కోసం బాల కేంద్రంతోపాటు అఖండ ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.