- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూల్చుడే తప్ప ఒరగబెట్టిందేమిటి..?
దిశ పటాన్ చెరు/అమీన్ పూర్ : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నిర్మాణాలను కూల్చూడే తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో పాల్గొని విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రైతులకు రైతు బంధు, యాదవులకు గొర్రెలను బంధు పెట్టారని, హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొట్టుడు తప్ప ఏడాదిగా ఏమైనా కట్టడా అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి, దేవుండ్ల మీద ఒట్టు పెట్టి, లగచర్లలో రైతులని జైల్లో పెట్టి సీఎం హిట్ వికెట్ అయ్యాడన్నారు. రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడని ఎద్దేవా చేశారు. సీఎంగా ఆయన పని అయిపోయిందన్నారు. అమీన్ పూర్ తో తనకు మంచి అనుబంధం ఉందని, నీళ్ల బాధలు చూసిన, ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ దే అన్నారు.
మిషన్ భగీరథతో బిందెలు పట్టుకునే అవసరం లేకుండా, అన్నీ గ్రామాలకు రోడ్లు వేసిన, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దే అన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే తమాల్ని సీఎం రేవంత్ రెడ్డి తిడుతున్నారని, ఆయన 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయాయని విమర్శించారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తనని దేవుళ్ల మీద ఓట్లు పెట్టిన రేవంత్ రెడ్డి, గద్దె ఎక్కి 12 నెలలు అయిందన్నారు. మహాలక్ష్మితో రూ. 24 వేలు ప్రతి మహిళకు సీఎం బాకీ ఉన్నారని, కాంగ్రెస్ వాళ్లు వస్తే చొక్కా పట్టుకొని మా పైసలు ఎవని నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఏపీ లో చంద్రబాబు ఇస్తున్నాడు ఇక్కడ రేవంత్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను తాగుబోతు అన్ తెలంగాణ చెయ్యాలని రేవంత్ రెడ్డి చూస్తున్నడని, కేసీఆర్ మాత్రమే తెలంగాణకు రక్ష అని హరీష్ రావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ దేశపతి శ్రీనివాస్, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, నాయకులు ఆదర్శ్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, సోమిరెడ్డి లు పాల్గొన్నారు.