గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

by Naveena |
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
X

దిశ,కోదాడ : గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు.ఆదివారం కోదాడ మండల పరిధిలోని పలు గ్రామాలలో మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గుడిబండ గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో..నూతనంగా 22 లక్షల రూపాయలతో నిర్మించిన నాలుగు దుకాణాలను ప్రారంభించారు. నూతనంగా నిర్మిస్తున్న గుడిబండ గ్రామపంచాయతీకార్యాలయానికి,కాలనీలో రోడ్డు కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కాపుగల్లు గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో..నూతనంగా నిర్మించిన 1000 మెట్రిక్ టన్నుల గోధం ను ప్రారంభించారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ నంబూరు సూర్యం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాపుగల్లు నూతన మండలం కోసం కృషి చేయాలని, కాపుగల్లు గ్రామం సర్వేశ్వరీపురం గ్రామంలో స్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎమ్మెల్యే దృష్టికి మాజీ సర్పంచ్ తొండపు సతీష్ తీసుకెళ్లారు.

అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ..సోసైటిల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో 2లక్షల ఋణ మాఫీ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ప్రభుత్వ భూములను ఐడెంటి ఫై చేయమని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. గ్రామాలలో గ్రామ సభల ద్వారా వాటిని అర్హులకు ఇచ్చే విధంగా చూస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెనేపల్లి చందర్రావ్, టిపిసిసి డెలిగేట్స్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,, డిసీసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,పాండురంగారావు, పారా సీతయ్య, వరప్రసాద్ రెడ్డి, ఇర్ల సీతారాం రెడ్డి, అమర నాయిని వెంకటేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ లు కొత్త రఘుపతి, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, నంబూరు సూర్యం, మదన్, జబ్బార్, ప్రసాద్, పూర్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed