Allu Arjun: అల్లు అర్జున్ మరో కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-15 16:47:25.0  )
Allu Arjun: అల్లు అర్జున్ మరో కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరో కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ‘న్యాయపరమైన కారణాల వల్ల బాధిత కుటుంబాన్ని కలవలేకపోతున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్(Sri Tej) త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే బాధిత కుటుంబాన్ని స్వయంగా కలుస్తాను’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్.. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి, నాగబాబును కలిశారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన, ఆయనపై నమోదైన కేసుల గురించి చర్చించారు. బన్నీతో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నారు.

Read More...

Venu Swamy: అల్లు అర్జున్ పార్టీ పెట్టి కీలక పదవి పొందుతారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ (వీడియో)


Advertisement

Next Story

Most Viewed