BRS: అల్లు అర్జున్‌లా వాళ్లకీ బెయిల్ దొరికితే బాగుంటుండె.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Ramesh Goud |
BRS: అల్లు అర్జున్‌లా వాళ్లకీ బెయిల్ దొరికితే బాగుంటుండె.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: చట్టం ఉన్న వాడికే చుట్టం అని, అల్లు అర్జున్(Allu Arjun) లాగే వాళ్లకి బెయిల్(Bail) దొరికితే బాగుండేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader Praveen Kumar) అన్నారు. లగచర్ల ఘటనలో(Lagacharla Incident) కొందరు రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Former MLA Patnam Narendar Reddy), ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్ఎస్పీ(RSP).. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. లగచర్ల రైతులు, వాళ్లకు బాసటగా నిలబడ్డ పట్నం నరేందర్ రెడ్డిలు గత నెల రోజులుగా జైలులో మగ్గుతూ తీవ్రమైన మానసిక హింసకు గురైతున్నారని తెలిపారు. వీరి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, వాళ్లకు కూడా నటుడు అల్లు అర్జున్ లాగా న్యాయ వ్యవస్థ కటాక్షం ‘ఆఘమేఘాల’ మీద దొరికితే బాగుంటుండె అని వ్యాఖ్యానించారు. అంతేగాక చట్టం ఉన్న వాడికే చుట్టం అని ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed