- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్తా చాటుదాం
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తమ సత్తా చాటి, అత్యధిక స్థానాల్లో బీసీలే గెలవాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ సాగర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం దేవరకద్ర కమిటీ ఆధ్వర్యంలో..కౌకుంట్ల మండల కేంద్రంలో జరిగిన బీసీ కులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మన ఓటు మనమే వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరుగబోయే ఎంఎల్ఏ,ఎంపీ స్థానాల్లో మనమే కీలకం కావాలని,బీసీ విద్యార్థులను నిరుద్యోగులుగా మార్చుతున్న ఈడబ్ల్యూఎస్,జీవో 29 లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ లే ఉన్నారని,భవిష్యత్తులో దేవరకద్ర ఎంఎల్ఏ గా బీసీలే గెలుపొందాలని ఆయన సూచించారు. హాజరైన వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ..బీసీ,ఎస్సీ ఎస్టీ,మైనారిటీ లు అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్తూ ఏ ఎన్నికలు వచ్చినా తమ వారే విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్ల ఆంజనేయులు,శేఖర్,భూత్పూర్ మండల కన్వీనర్ ఆంజనేయులు,జహంగీర్,గోపాల్ సాగర్,కిస్టన్న,శ్రీనివాస్ రావు,చందు గౌడ్,కావలి శేఖర్,ఉల్లి నరేష్,బజారు శ్రీనివాసులు,కథాలయ్య,యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.