Cyber : సైబర్ సెక్యూరిటీ ద్వారా రూ.33.27 కోట్ల రీఫండ్

by Ramesh Goud |
Cyber : సైబర్ సెక్యూరిటీ ద్వారా రూ.33.27 కోట్ల రీఫండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెగా నేషనల్ లోక్ అదాలత్‌లో ప్రీ-లోక్ అదాలత్-ప్రొసీడింగ్‌లతో 4,893 సైబర్ మోసాల కేసులు పరిష్కరించి బాధితులకు రూ.33.27 కోట్ల రీఫండ్‌ చేయడం జరిగిందని టీజీసీఎస్బీ డైరక్టర్ శిఖా గోయాల్ తెలిపారు. రీఫండ్ గణాంకాలు మునుపటి లోక్ అదాలత్ గణాంకాలు రూ.27.2 కోట్లను అధిగమించాయని తెలిపారు. లోక్ అదాలత్ వివరాలను ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. 2024 సంవత్సరం టీజీసీఎస్బీ అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలిపారు. ఇప్పటి వరకు 17,210 మంది బాధితులకు రూ.155.22 కోట్లు రీఫండ్ చేయబడిందని పేర్కోన్నారు. సైబర్ క్రైమ్‌లను పరిష్కరించడంలో టీజీసీఎస్బీ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయడం గర్వకారణమన్నారు

* లోక్ అదాలత్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన యూనిట్లు

యూనిట్ కేసుల సంఖ్య రీఫండ్ చేయబడిన మొత్తం

1. సైబరాబాద్ 2,136 . రూ.12,77,49,117 /-

2. హైదరాబాద్ 268 రూ. 8,84,17,621/-

3. రాచకొండ 592 రూ. 4,53,06,114/-

4. టీజీసీఎస్బీ 60 రూ.1,06,49,044/- .

5. సంగారెడ్డి 188 రూ.98,63,438/-

టీజీసీఎస్బీ అధికారులు, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ( టీజీఎల్ఎస్ఏ), జిల్లా న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్‌లు, డిఎల్ఎస్ఏఎస్, సీపీలు ,జిల్లా ఎస్పీల సమన్వయంతో ఈ ఘనత సాధించమన్నారు. సైబర్ నేరానికి గురైనా బాధితులు "గోల్డెన్ అవర్" సమయంలో, సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలన్నారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే, వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.inలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్ ఆర్సీపి) ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed