- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు రాగానే ఇంధన ధరలు తగ్గిస్తారు : సబితా ఇంద్రారెడ్డి
దిశ, మహేశ్వరం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు రాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండలంలోని నాగారం, నందు పల్లి, తీగల కుంట తండా, ఏనుగు చెరువు తండా, పడమటి తండా, నాగిరెడ్డిపల్లి, పులిమక్త, గొల్లూరు, అమీర్ పేట్, తూప్రఖుర్ధు,పెద్దమ్మ తండా, నల్ల చెరువు తండా, మాణిక్యమ్మ గూడ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...మహేశ్వరం నియోజకవర్గంలో మెట్రో రానున్న కాలంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు 6600 కోట్లతో మెట్రో రైలు నిర్మాణం చేపడతామన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజలే నా బలం బలగం అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
నియోజకవర్గంలో రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు 389 కోట్లు, రైతు బీమా ద్వారా 24 కోట్లు, రుణమాఫీ కింద 87 కోట్లు, ఆసరా పెన్షన్లు 576 కోట్లు, కళ్యాణ లక్ష్మి కింద 108 కోట్లు, షాది ముబారక్ పథకం 51 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ 15 కోట్లు సహాయం చేశామన్నారు. 176 కోట్ల తో మెడికల్ కాలేజ్, 1200 కోట్లతో కొత్తపేట సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి 10 కోట్ల తో, జల్ పల్లి లో 30 పడకల ఆసుపత్రి, 6 కోట్ల తో మహేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 50 పడకల గా అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు. 13 బస్తీ దవాఖానలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 16 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. 280 కోట్ల నిధులతో విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చమన్నారు. 40 కోట్ల తో అర్బన్ ఫారెస్ట్ పార్కులు, పురాతన దేవాలయాల అభివృద్ధికి 10 కోట్లు, 450 కోట్ల తో రోడ్ల అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 284 కోట్లు, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 160 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.