10 ఏళ్ల అమ్మాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అబ్బాయితో..!

by Jakkula Mamatha |
10 ఏళ్ల అమ్మాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అబ్బాయితో..!
X

దిశ,వెబ్‌డెస్క్: పేరెంట్స్.. పిల్లలు మీ ఫోన్ తీసుకుని వాడుతున్నారా? అయితే ఓ కన్నేయాల్సిందే. ఇటీవల యువత మొబైల్స్ వల్ల చెడు దారి పడుతున్నారనడంలో ఆశ్చర్యం లేదు. వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లు యూజ్ చేయడం ప్యాషన్ అయిపోయింది. ఇక మొబైల్స్ లో ఇన్‌స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రాత్రుళ్లు ఫోన్‌లో లీనమైపోతున్నారు. దీంతో అనారోగ్యం పాలైన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇక ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తితో పరిచయం పెంచుకుని, తెలిసీ తెలియని వయసులో ప్రేమయాణం నడుపుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రులను ఎదిరించడం తరచూ వార్తల్లో చూస్తునే ఉన్నాం. తాజాగా గుజరాత్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. గుజరాత్‌కు చెందిన ఓ పదేళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పక్క ఊరి అబ్బాయి(16)తో పారిపోయింది. ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పరిచయం పెంచుకున్నారు. ఐదో తరగతి చదువుతున్న అమ్మాయి డిసెంబర్ 31న తప్పిపోయిందని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే వీరిని సమీప గ్రామం నుంచి పోలీసులు పట్టుకున్నారు. జువైనల్ హోంకు తరలించారు. పోలీసులు వెతికి అమ్మాయిని వాళ్లింటికి చేర్చారు. ఆ బాలిక కొన్నాళ్లుగా తల్లి ఫోన్లో Insta వాడుతోందని స్నేహితుల సాయంతో అతడితో పారిపోయిందని తెలిపారు. పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు వారిని గమనించాలని పోలీసులు సూచించారు.

Advertisement

Next Story