Raithu Bharosa: రైతు భరోసాపై ఊర్లలో వెలసిన పోస్టర్లు.. నెట్టింట విమర్శలు

by Ramesh Goud |
Raithu Bharosa: రైతు భరోసాపై ఊర్లలో వెలసిన పోస్టర్లు.. నెట్టింట విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: రైతు భరోసా(Raithu Bharosa)పై ఊర్లలో గోడలపై పోస్టర్లు(Posters) వెలిసాయి. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎన్నికల హామీ ప్రకారం ప్రతీ ఎకరానికి రూ. 7500 చోప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిందని, కానీ ఇంతవరకు ఆ హమీ అమలుకు నోచుకోలేదని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. అంతేగాక దీనిపై ప్రతీ ఊర్లో పోస్టర్లు వేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసాపై కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ.. పోస్టర్లు దర్శనం ఇచ్చాయి.

ఈ పోస్టర్లలలో ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావ్ రేవంత్(Revanth Reddy)? అంటూ.. 2023 యాసంగిలో ఒక్కో ఎకరానికి రూ.2,500, 2023 వానాకాలం రూ.7,500, యాసంగి రూ.7,500 మొత్తం కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి రూ.17,500 రైతు భరోసా బాకీ పడిందని రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేసి రైతు బంధు(Raithu Bandhu) పేరుతో వందల ఎకరాలు ఉన్న వాళ్లకు దోచిపెట్టారని, ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయడం సిగ్గు చేటని మండిపడుతున్నారు. అంతేగాక రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని, సాగు చేసే వారికే రైతు భరోసా ఇవ్వాలని, అది కూడా కొన్ని ఎకరాలకు మాత్రమే పరిమితి చేసి ఇవ్వాలని పలువురు సూచనలు చేస్తున్నారు.

Advertisement

Next Story