ఏఏ ఆహారాలు ఎంత సమయం వరకు జీర్ణమవుతాయి..?

by Anjali |   ( Updated:2025-01-04 15:55:56.0  )
ఏఏ ఆహారాలు ఎంత సమయం వరకు జీర్ణమవుతాయి..?
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రైస్‌తో పాటుగా పలు ఆహారాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ తిన్న ఆహార పదార్థాలు ఎంత సమయం వరకు జీర్జం అవుతాయని చాలా మందిలో ఇలాంటి సందేహాలు తలెత్తే ఉంటాయి. కాగా తాజాగా నిపుణులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. నిపుణులు చెప్పిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఆహారం డైజెషన్ అవ్వడానికి అయితే నుంచి 3 గంటల సమయం పడుతుంది. మరీ పండ్లు ఎంత సమయం పడుతుందని తాజాగా నిపుణులు వెల్లడించారు. కొన్ని ఆహారాలు తొందరగా జీర్జమవుతాయి. మరికొన్ని ఆహారాలు లేట్ గా అవుతాయి. పండ్లు అయితే ముప్పై నుంచి నలభై నిమిషాల్లో డైజెషన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రూట్స్(Fruits) జీర్జమై.. చిన్న పేగు(small intestine)కు చేరుతాయి. అక్కడి నుంచి వ్యర్థ పదార్థాలు పెద్ద పేగుకు చేరుతాయి.

అలాగే శరీరంలో కూరగాయలు 30 నిమిషాలు నుంచి గంట వరకు డైజెషన్ అవుతాయి. అలాగే నీటి శాతం ఎక్కువగా దోస(Dosa), పాలకూర(lettuce), ముల్లంగి(radish), క్యాప్సికం(capsicum) వంటివి నలభై నిమిషాలు పడుతుంది. అలాగే బ్రోకలీ, క్యాలీఫ్లవర్, చిలగడదుపలు, బీట్ రూట్ వంటివి 50 నుంచి గంట సమయం పడుతుంది. ఇక ధాన్యాలు, గింజలు చూసుకున్నట్లైతే.. గంటన్నర సమయం పడుతుంది. బటానీ, శనగలు, రాజ్మా వంటివి 3 గంటలు పడుతుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More...

Lifestyle: వీటిని తినడం అలవాటు చేసుకుంటే.. ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు!


Advertisement

Next Story