George Soros: హిల్లరీ క్లింటన్, జార్జ్ సోరోస్, మెస్సీలకు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్.. ప్రకటించిన బైడెన్

by vinod kumar |
George Soros: హిల్లరీ క్లింటన్, జార్జ్ సోరోస్, మెస్సీలకు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్.. ప్రకటించిన బైడెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ (Hillory Clinton), ఫ్యాషన్ డిజైనర్ రాల్స్ లారెన్ (Ralse laren), ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ(lionel messy), వివాదాస్పద పెట్టుబడిదారు జార్జ్ సోరోస్ (George soros) సహా 19 మందికి అమెరికా దేశ అత్యన్నత గౌరవమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ అవార్డుకు ఎంపికైనట్టు అధ్యక్షుడు జో బైడెన్ (jo byden) ప్రకటించారు. వైట్ హౌస్ లో జరిగే కార్యక్రమంలో వీరందరికీ అవార్డులు అందజేయనున్నారు. అవార్డుకు ఎంపికైన వ్యక్తులు వివిధ రంగాల్లో కృషి చేసి అమెరికా, ప్రపంచాన్ని మెరుగుపర్చిన గొప్ప వ్యక్తులని వైట్ హౌస్ తెలిపింది. ‘యూఎస్ శ్రేయస్సు, భద్రత, విలువలు, ప్రపంచంలో శాంతి, ఇతర సామాజిక మార్పునకు కృషి చేసిన వ్యక్తులకు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందజేస్తాం’ అని పేర్కొంది.

కాగా, హిల్లరీ క్లింటన్ అనేక దశాబ్దాలుగా ప్రజా సేవలో పనిచేశారు. అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అమెరికా రాజకీయ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఇక, జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు. అతను 120 కంటే ఎక్కువ దేశాల్లో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, విద్య, సామాజిక న్యాయం కోసం అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించాడు. అయితే గత కొంత కాలంగా ఆయన భారత ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తున్నాడు. లియోనెల్ మెస్సీ ప్రపంచంలోని గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరు. ఇతర అవార్డు గ్రహీతల్లో బోనో, మైఖేల్ ఫాక్స్, డెంజెల్ వాషింగ్టన్, టిమ్ గిల్‌లు ఉన్నారు.

Advertisement

Next Story