- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా.. డొక్కా సీతమ్మ(Dokka Seethamma) మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal scheme) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Education Minister Nara Lokesh) ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర విమానాయ శాఖ మంత్రి(Union Minister of Aviation) రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) సైతం సోంపేట మండలం బారువ ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal scheme) ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అందులో.. "ఆరోగ్యవంతమైన సమాజానికి విద్యార్థి దశే కీలకం.
ఈ ప్రాధాన్యత గుర్తించి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించి, పోషకాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన అద్భుతమైన కార్యక్రమం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమాన్ని సోంపేట మండలం బారువ ప్రభుత్వ కళాశాలలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ గారు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారితో కలిసి ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేయడం, వారి భవిష్యత్తు ఆలోచనలను తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను" అని రాసుకొచ్చారు. అలాగే ఈ ట్వీట్‌కు తాను విద్యార్థులతో కలిసి కూర్చోని భోజనం చేసిన ఫోటోలను షేర్ చేశారు.