వివాహం జరగడం లేదని మనస్థాపంతో యువతి ఆత్మహత్య

by Kalyani |
వివాహం జరగడం లేదని మనస్థాపంతో యువతి ఆత్మహత్య
X

దిశ, నల్లబెల్లి: తనకన్నా వయసులో చిన్న వాళ్ళయినా చెల్లెళ్లకు పెళ్లిళ్లు జరగడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రుద్రగూడెం గ్రామ శివారు పెద్ద తండా కు చెందిన అజ్మీర వసంత(32) ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. గత కొద్ది నెలల నుండి ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ ఏ సంబంధం కుదరకపోవడం, తన చెల్లెలు ఇద్దరికీ పెళ్లి కావడంతో మనస్థాపానికి గురైంది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎస్సై గోవర్ధన్ వివరణ కోరగా మృతురాలి సోదరుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Advertisement

Next Story