- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిగిలో ఎస్ఎల్ఎన్ ఘరానా మోసం…
దిశ,పరిగి : సేవ్ మనీ అండ్ మనీ విల్ సేవ్ యూ అంటూ ఎస్ఎల్ ఎన్ కే గ్రూప్ పేరుతో ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ పరిగిలో అమాయకులను మోసం చేసి లక్షలు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది. పరిగిలో బాహర్ పేట్ ముత్తూట్ ఫైనాన్స్ పైన 2016 సంవత్సరంలో ఈ ఎస్ఎల్ఎన్ కే చిట్ ఫండ్ ఏర్పాటు చేసి పరిగి, దోమ మండలాలకు చెందిన కొందరిని అందులో మేనేజర్లు, ఇతర సిబ్బందిని నియమించి రూ.10 లక్షలు 5, లక్షలు, 3 లక్షలు చిట్టీలు వేసి జనాలను ఆకట్టుకున్నారు. కాయా కష్టం చేసి నెలనెల డబ్బులు కట్టి తీరా మోసపోయామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు తిప్పేసి మూడేళ్లవుతున్నా మాకు డబ్బులు ఇవ్వడం లేదంటూ మరోసారి ఎస్ఎల్ ఎన్ కే బాధితులు పరిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పరిగి డిఎస్సీ శ్రీనివాస్ కి పదుల సంఖ్యలో బాధితులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఎన్ఎల్ ఎన్ కే ఆఫీస్ ఓనర్ కి కూడా మూడేళ్ల నుంచి అద్దె ఇవ్వకుండా తిరిగి తనపైనే దబాయిస్తున్నారంటూ డీఎస్పీ శ్రీనివాస్ కు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఎల్ఎన్ కే ప్రైవేట్ చిట్ ఫండ్ వారి నుంచి మాకు న్యాయం చేసి మా డబ్బులు మా ఇప్పించాని బాధితులు కోరుతున్నారు.
ఎస్ఎల్ ఎన్ కే బాగోతం
ఎస్ఎల్ ఎన్ కే ప్రైవేట్ చిట్ ఫండ్ వాళ్లు మొదట్లో కొంత మందికి చిట్టీ డబ్బులు సక్రమంగా ఇచ్చినట్టు చేసి తర్వాత మోసానికి పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. పరిగి తో పాటు వీరికి చేవెళ్లలో మరో బ్రాంచి ఉందని బాధితులు చెబుతున్నారు. పరిగిలో చిట్టీలు లేవని డబ్బులు ఇవ్వడం లేదంటూ గతంలో కార్యాలయం లో గొడవలకు దిగారు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా కార్యాలయానికి తాళం వేశారు అప్పట్లో. మోసానికి పాల్పడుతున్నారని చిట్టీలు వేసిన వారంతా మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అంటూ పరిగి ఎస్ఎల్ ఎన్ నే బ్రాంచి మేనేజర్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో నెమ్మదిగా పరిగి, దోమ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది అందులో పని చేయడం మానేశారు. ఎస్ఎల్ ఎన్ కే బాధితులు నెమ్మదిగా పరిగి పోలీస్ స్టేషన్ బాట పట్టారు. ఇప్పట్లో ఎస్, సీఐలు, డిఎస్పీలు కూడా వారిని పిలిపించి కొంత మందికి డబ్బులు ఇప్పించేలా చర్యలు చేపట్టారు.
వందల సంఖ్యలో చెక్కులు బోన్స్...లక్షల్లో మోసం
చిట్టీలు లేపిన వారికి ఎస్ ఎల్ ఎన్ చిట్ ఫండ్ వారు ఇచ్చేని దక్కన్ బ్యాంకు చెక్కలు వందల సంఖ్యలో బోన్స్ అయినట్లు బాధితులు తెలుపుతున్నారు. ఇదేంటీ చిట్టీ లేపిన అమౌంట్ ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడం ఏంటంటీ ప్రశ్నించగా వారికి కొంత నగదు ఇచ్చి తరువాత ఇస్తామంటూ కొన్నేళ్లు నెట్టుకొచ్చారు. ఇలా ఎస్ఎల్ ఎన్ కే బాధితులు వందల సంఖ్యలో చేవెళ్లకు బయలు దేరడంతో అక్కడ కూడా బోర్డు తిప్పేసినట్లు బాధితులు తెలిపారు.
మూడేళ్లుగా ఇవ్వడం లేదు..డబ్బులు అడిగితే కొట్టేందుకు వస్తున్నారు : మక్త వెంకటాపూర్
ఎస్ఎల్ఎన్ కేలో రూ. 5 లక్షల చిట్టీ వేసి 42వ నెలలో 4 లక్షలకు చిట్టీ లేపాను. చిట్టీ లేపిన సమయంలో ఒక లక్ష చెక్కు ఇచ్చారు. అప్పుడు గొడవ జరిగి ఆఫీక్కి తాళం వేశారు. మిగతా డబ్బులు రేపు ఇస్తాం, వారంకి ఇస్తాం అంటూ మూడేళ్లుగా ఇబ్బంది పెడుతున్నారు. గిరిదర్, దేవెందర్ లకు ఫోన్ చేస్తే దురుసుగా మాట్లాడారు. ఇంటికి వెళ్తే నాపై చేయి చేసుకునేందుకు వస్తున్నారు. చిట్టీ అయిపోయి నాలుగేళ్లు కావస్తుంది రూ. 2.16 లక్షలు ఇవ్వాల్సి ఉంది. నేను పోలీసులను ఆశ్రయిస్తా
విచారణ జరిపి న్యాయం చేస్తాం : డిఎస్సీ శ్రీనివాస్
చిట్టీలు వేయగా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి వెళ్లి పోయారంటూ ఎస్ఎల్ ఎన్ కే చిట్ ఫండ్ పై బాధితులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇంటి ఓనర్ కూడా మూడేళ్ల అద్దె ఇవ్వకుండా తనపై దురుసుగా మాట్లాడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఎల్ ఎన్ కే వారిని పిలిపించి ఎవరెవరికి ఎంత డబ్బు ఇవ్వాలని విచారణ చేసి న్యాయం చేస్తాము. ఎస్ ఎల్ ఎన్ కే బాధితులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.