అక్రమంగా తరలిస్తున్న డీజిల్​ పట్టి వేత

by Kalyani |
అక్రమంగా తరలిస్తున్న డీజిల్​ పట్టి వేత
X

దిశ, పరిగి : కర్ణాటక నుంచి డీజిల్​ ను కొనుగోలు చేసి హైదరాబాద్​ కు తరలిస్తున్న ట్యాంకర్​ టాస్క్​ ఫోర్స్ వాళ్లు పట్టుకున్నారు. పరిగి ఎస్​ఐ సంతోష్ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్​ చెందిన శ్రీనివాస్​ సోమవారం కొడంగల్​ వైపు నుంచి పరిగి వైపునకు టీఎస్​ 07 యూబీ 7149 నెంబరు గల ట్యాంకర్ వస్తుండగా పక్కా సమాచారంతో టాస్క్​ ఫోర్స్​ వాళ్లు పట్టుకున్నారు. అందులో 6 వేల లీటర్ల డీజిల్​ ఉన్నట్లు గుర్తించారు. ఈ డీజిల్​ విలువ 6 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా వేశారు. హైదరాబాద్​ తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. పూర్తి విచారణ చేపట్టి తదుపరి చర్యలు చేపడతామని ఎస్​ఐ సంతోష్​ కుమార్ తెలిపారు. కాగా కొంతకాలంగా ఈ డీజిల్​ అక్రమ దందా అధికారులు, పాలకుల కనుసన్నల్లో జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story