- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో విద్యుత్ సరఫరాపై యాక్షన్ ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న వేసవి కాలంలో పెరగనున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తగు చర్యలు చేపట్టింది. డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీకి సిద్ధమవుతున్నారు. సోమవారం ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి నూతనంగా నిర్మితమవుతున్న సబ్ స్టేషన్ పనులను పరిశీలించారు. మేడ్చల్ పరిధిలో బౌరంపేట్‌లో నిర్మితవుతున్న 132 కేవీ సబ్ స్టేషన్‌ను, టవర్ నిర్మాణ పనులు తనిఖీ చేశారు. అలాగే బౌరంపేట్ 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో అదనంగా ఏర్పాటుచేసిన 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వేసవి సన్నాహక చర్యల్లో భాగంగా చేపట్టిన పనుల్లో హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో 35.., 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లికింగ్, 149 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. హబ్సిగూడ సర్కిల్ పరిధిలో 90.., 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 14.., 33 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లికింగ్, 14 పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు, 545 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో 127.., 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 4.., 33 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 25 పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు, 232 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో 49.., 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 7.., 33 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 23 పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు, 309 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలో 46.., 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 73 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో 67.., 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 9.., 33 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 24 పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు, 171 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎండీ స్పష్టంచేశారు. హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో 18.., 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 6 పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు, 137 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు వంటి వివిధ పనులను చేపడుతున్నట్లు వివరించారు.
ఇదిలా ఉండగా విద్యుత్ డిమాండ్ లో భారీ పెరుగుదలకు అవకాశమున్న రంగారెడ్డి జోన్ పరిధిలో 254.., 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 26.., 33 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్ లింకింగ్ పనులు, 81 పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు, 1,252 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపుతో పాటు అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ వినియోగం గతేడాది ఎండాకాలంతో పోల్చుకుంటే గణనీయంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. గతేడాది 3,756 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్ ఈ ఏడాది దాదాపు 16 శాతం వృద్ధిచెంది 4,352 మెగావాట్లుగా నమోదైనట్లు చెప్పారు. గతేడాది 81.39 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం దాదాపు 12 శాతం వృద్ధితో 90.68 మిలియన్ యూనిట్లకు చేరిందని తెలిపారు. 2025 వేసవిలో సైతం విద్యుత్ డిమాండ్ గతం కంటే ఎక్కువగా రికార్డుస్థాయిలో పెరిగే అవకాశముందని, డిమాండ్ ఎంత పెరిగినా సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. సీఎండీ వెంట ఎస్పీడీసీఎల్ మేడ్చల్ చీఫ్ ఇంజినీర్ అట్లూరి కామేష్, ట్రాన్స్ కో చీఫ్ ఇంజినీర్ వై చిరంజీవులు, ట్రాన్స్ కో సూపరింటెండింగ్ ఇంజినీర్ రాంజీ, మేడ్చల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.