- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : గ్రూప్ 2 లో చంద్రబాబుపై ప్రశ్నలు... హరీష్ రావు మండిపాటు
దిశ, వెబ్ డెస్క్ : సోమవారం జరిగిన గ్రూప్ 2(Group 2) పరీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) గురించి ప్రశ్నలు రావడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. "తెలంగాణ చరిత్ర, పోరాటం చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అది పేపర్ మీద చేసిన సంతకం కాదు.. కాలం మీద చేసిన సంతకం.. ఉద్యమ చరిత్రను చెరిపేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల యత్నాలను తెలంగాణ సమాజం గుర్తించింది, మీకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూప్ 2 నాలుగు పేపర్లలో చివరిదైన తెలంగాణ ఉద్యమం పేపర్(Telangana Movment Paper) సోమవారం మధ్యాహ్నం జరిగింది. అయితే ఈ పేపర్లో తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాల నుంచి పలు ప్రశ్నలు ఆడగాల్సింది పోయి, ఉమ్మడి ఏపీలోని చంద్రబాబు నాయుడు పాలన గురించి పలు ప్రశ్నలు అడిగారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 'ఇది టీజీపీఎస్సీ(TGPSC)నా ? టీడీపీ(TDP) ఎస్సీనా? ఇది తెలంగాణ ప్రభుత్వమా ? తెలుగుదేశం ప్రభుత్వమా?' అని మండిపడుతున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బహిరంగంగా ప్రకటించారని, కాని నిజానికి తెలంగాణ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ పరీక్షల్లో తెలుగుదేశం ప్రస్తావన ఎందుకని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, కష్టాలు, కన్నీళ్లకు తొలిద్రోహి కాంగ్రెస్ అయితే.. మలిద్రోహి టీడీపీ అని దుయ్యబట్టారు. ఉద్యమంలో కాంగ్రెస్, టీడీపీ చేసిన మోసాలు, ద్రోహాలు తెలంగాణ ఎప్పటికీ మరిచిపోదని అన్నారు.