- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ చోరీ.. మహిళ వద్ద 28 తులాల బంగారం మాయం
దిశ, జగిత్యాల టౌన్: సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో గల ఆర్టీసీ బస్టాండ్ లో గుర్తు తెలియని వ్యక్తులు మహిళ వద్ద 28 1/2 తులాల బంగారాన్ని దొంగిలించారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు జగిత్యాల రూరల్ మండలం తక్కలపెల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి జలజ అనే మహిళ తన 28 1/2 తులాల బంగారాన్ని బ్యాంకు లో డిపాజిట్ చేస్తాద్దమని వెళ్లారు. కొన్ని కారణాల వల్ల డిపాజిట్ చేయకుండా తిరిగి పాత బస్టాండ్ లో తక్కళ్లపల్లికి వెళ్లేందుకు మంచిర్యాల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఈ క్రమంలో ఇంటికి వెళ్లి చూసే సరికి బ్యాగ్ లో బంగారం లేకపోవడంతో కంగుతిన్న మహిళ భర్తకు తెలపడంతో జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి భర్త మిట్టపల్లి రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎంక్వయిరీ చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించి, చోరీ చేసిన దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు.