TMC MP Fire On Congress : ఈవీఎం ట్యాంపరింగ్.. కాంగ్రెస్‌పై టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఫైర్

by Sathputhe Rajesh |
TMC MP Fire On Congress : ఈవీఎం ట్యాంపరింగ్.. కాంగ్రెస్‌పై టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కొట్టిపారేశారు. ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలపై చేస్తున్న ఆరోపణలకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎవిడెన్స్ ఉంటే వెళ్లి ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలను నిందించడం ఎందుకు ఫలితాలను అంగీకరించాలని కాంగ్రెస్‌కు ఇటీవల జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చురకులు అంటించిన విషయం తెలిసిందే.తాజాగా టీఎంసీ ఎంపీ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేయడం ఇండియా కూటమిలో దుమారం రేపుతోంది. ‘ఈవీఎంలను హ్యాక్ చేసినట్లు ఇంకా కొంత మంది భావిస్తే.. ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్లి ఎలా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చో డెమో చూయించాలి.’ అన్నారు. మమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలపై మీడియా ప్రశ్నంచగా ఈ అంశంపై కూర్చొని మాట్లాడతామన్నారు. మమతా సీనియర్ నాయకురాలని.. మూడో సారి సీఎంగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా సైతం పనిచేశారన్నారు. దీనిపై క్షుణ్ణంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

రాహుల్ గాంధీపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో విఫలమై ఈవీఎంలను నిందిస్తున్నారని బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. నాయకత్వం సంపాదించుకుంటే లేదా డిమాండ్ చేస్తే వచ్చేది కాదన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అంశంపై స్పందిస్తూ.. ఈవీఎంలలో సమస్య ఉంటే ఒమర్ అబ్దుల్లా సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. కర్ణాటక, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలతో ఎలాంటి సమస్య లేదని.. మహారాష్ట్రలో ఓడిపోతే మాత్రం ఈవీఎంలను నిందిస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story