గ్రూప్ పరీక్షలకు పక్కాగా భద్రత ఏర్పాట్లు

by Naveena |
గ్రూప్ పరీక్షలకు పక్కాగా భద్రత ఏర్పాట్లు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా ఎస్పీ జానకి ఆధ్వర్యంలో 54 పరీక్ష కేంద్రాల్లో 20584 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో చేసిన భద్రతా ఏర్పాట్లతో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఐజీ సత్యనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,నిఘాను మరింత పటిష్టంగా అమలు పరచి,ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా డిఎఫ్ఎండీ లతో తనిఖీలు చేశామన్నారు.మల్టీ జోన్ 2 కింద మొత్తం 9 జిల్లాల ఎస్పీ లు రెండు రోజులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి..విజయవంతంగా కృషి చేశారన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు భారీ బందోబస్తుతో పేపర్లు హైదరాబాద్ కు పంపడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి,అదనపు ఎస్పీ లు రాములు,సురేష్ కుమార్,డిఎస్పీ వెంకటేశ్వర్లు తదితర పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story