- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 రోజులు దాటినా సర్టిఫికెట్ ఇవ్వలేదు..
దిశ, భిక్కనూరు : డెత్ సర్టిఫికెట్ ఇవ్యడం లేదని భిక్కనూరు మండలం సిద్దరామేశ్వర నగర్ గ్రామానికి చెందిన సల్మెడి తిరుమలయ్య జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు ఫిర్యాదు చేశారు. సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొని 20 రోజులు గడుస్తున్నా..గ్రామపంచాయతీ సెక్రటరీ డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. గత నెల 21న తన తల్లి చనిపోతే, డెత్ సర్టిఫికెట్ కోసం 20 రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్టిఫికెట్ ఇవ్వకుండా సతాయిస్తుండడంతో, స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డెత్ సర్టిఫికెట్ ఇవ్వకుండా సతాయిస్తున్న సెక్రటరిపై శాఖ పర్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు డెత్ సర్టిఫికెట్ ఇప్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.