Gandhi Bhavan: గ్రేటర్‌లో దమ్మున్న కాంగ్రెస్ లీడర్ లేడు.. దీపాదాస్ మున్షీ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-16 15:19:54.0  )
Gandhi Bhavan: గ్రేటర్‌లో దమ్మున్న కాంగ్రెస్ లీడర్ లేడు.. దీపాదాస్ మున్షీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(Congress Party) ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. మాజీ ఎంపీలు వీహెచ్(VH), అంజన్ కుమార్ యాదవ్‌(Anjan Kumar Yadav)ల ప్రసంగాలపై మైనార్టీ నేతలు అభ్యంతరం తెలిపారు. మైనార్టీలు కాంగ్రెస్‌లో ఉంటూనే ఎంఐఎం‌కు ఓటేస్తారని వీహెచ్, అంజన్ కుమార్‌లు అన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మైనార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తనకు మంత్రి ఇవ్వాల్సిందేనని అంజన్ కుమార్ యాదవ్ మనసులోని మాటను బయటపెట్టారు.

దీనిపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం మొత్తం గందరగోళంగా మారింది. ఈ పరిణామాలతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో దమ్మున్న కాంగ్రెస్ లీడర్ ఒక్కరు కూడా లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లకు కౌంటర్ ఇవ్వడం మీకు చేతకాదని అన్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్‌గా ఉంది. ఇక్కడి పబ్లిక్ కూడా చాలా చీప్‌గా ఉన్నారు. రూ.100, 200 ఇస్తే చాలు మీటింగ్‌కు వచ్చేస్తారు అని దీపాదాస్ మున్షీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story
null