Formula E-Race: గవర్నర్ నుంచి ఆమోదం లభించింది.. చిట్‌చాట్‌లో కుండబద్దలు కొట్టిన పొంగులేటి

by Gantepaka Srikanth |
Formula E-Race: గవర్నర్ నుంచి ఆమోదం లభించింది.. చిట్‌చాట్‌లో కుండబద్దలు కొట్టిన పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ ఫార్ములా ఈ-రేస్(Formula E-Race) నిధుల బదలాయింపుపై విచారణకు తెలంగాణ గవర్నర్(Telangana Governor) ఆమోదం తెలిపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. అతి త్వరలో సీఎస్‌ ద్వారా ఏసీబీ(ACB)కి లేఖ వెళ్లనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్ములా-ఈరేస్ అవకతవకలపై కేబినెట్‌లోనూ చర్చించినట్లు తెలిపారు.

అందులో పెట్టిన పెట్టుబడుల లెక్కను కూడా ఏసీబీ తేలుస్తుందని అన్నారు. కేటీఆర్‌(KTR)ను అరెస్ట్ చేస్తారో లేదో తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఏ బాంబ్ అనేది అతి త్వరలోనే తేలుతుందని మరో బాంబ్ పేల్చారు. అరెస్ట్ వార్తలు రాగానే ఢిల్లీకి ఎందుకు పరిగెత్తారని ప్రశ్నించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్(IAS Arvind Kumar) విచారణకు కూడా సీఎస్ అనుమతి ఇచ్చారని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. అంతేకాదు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ చట్టం ప్రవేశ పెడతామని అన్నారు.

Advertisement

Next Story