‘ఫ్యాషన్ కవిత్వానికి నమస్కరిస్తున్నాను’.. టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Anjali |
‘ఫ్యాషన్ కవిత్వానికి నమస్కరిస్తున్నాను’.. టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అందం, అభినయం, నటనతో సినీ ప్రేక్షకుల మనసు దోచేసింది టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Kanna). నటిగా తొలి సినిమా బాలీవుడ్‌లో చేసింది. తర్వాత 2013లో విడుదలైన మద్రాస్ కేఫ్(Madras Cafe) సినిమాలో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత తెలుగులో 2014లో ‘ఊహలు గుసగుసలాడే’(Uhalu gusagusalaḍe) మూవీలో కథానాయికగా నటించింది. థ్యాంక్యూ(thank you), ధనుష్(Dhanush) సరసన తిరు(Thiru), తొలిప్రేమ(Toliprēma), బెంగాల్ టైగర్(Bengal Tiger, హైపర్(Hyper), శ్రీనివాస కల్యాణం(Srinivasa Kalyanam), జై లవ కుశ(Jai lava kusa), ప్రతి రోజూ పండగే(Prati roju paṇḍage), జోరు(Jōru), టచ్ చేసి చూడు, సుప్రీమ్(Supreme), శివమ్(Shivam), వరల్డ్ ఫేమస్ లవర్(world famous lover) వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకుని తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.

ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదకన అభిమానులతో ఓ పోస్ట్ పంచుకుంది. ‘ఫ్యాషన్ కవిత్వానికి నమస్కరిస్తున్నాను’ అంటూ రాశీ ఖన్నా పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ బ్యూటీ వైట్ అండ్ బ్లాక్ స్టైలిష్ డ్రెస్ ధరించి ఖతర్నాక్ ఫొటో షూట్ చేసింది. చేతికి రెండు ఆకట్టుకునే ఉంగరాలతో.. మత్తెక్కించే చూపులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కనిపించి కనిపించని ఎద అందాలతో రచ్చ చేస్తోన్న రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story