- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేనుకు చీరలే రక్షణ కవచాలు..
దిశ, కొత్తూర్ : ఖరీఫ్ (పునాస పంట) కాలం ముగిసింది. రబీ (యాసంగీ) కాలం మొదలయ్యింది. దీంతో ఎక్కడ నీళ్ల సౌలతీ ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే పచ్చగా ఉంటుంది. ఈ కాలంలో మండల పరిధిలోని రైతులు ఎక్కువగా తేమతో పండే పంటలు వేస్తుంటారు. బోరు మోటర్లు ఉన్న ఇంకా కొందరు రైతులు టామాటా, మిర్చి , మొక్కజొన్న, వరి తదితర పంటలు పండిస్తుంటారు. ముందే ఖరీఫ్ కాలం ముగిసింది. దీంతో అడవి జంతువులకు ఆహారం కొరత ఏర్పడుతుంది. అందుకే ఈ యాసంగిలో రైతులకు పంటలను పండించడం ఒకెత్తు అయితే వాటిని అడవి పందులు, ఇతర జంతువుల నుండి రక్షించుకోవడం ఇంకో ఎత్తు.
ఎందుకంటే వాటికి ఎక్కడ పచ్చగా కనిపిస్తే అక్కడకు వచ్చి చేరుతాయి. అవి ఆహారం తినడం ఏమో కానీ పంట చేనులో అవి చేసే విధ్వంసమే ఎక్కువగా ఉంటుంది. దీంతో వాటి బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు ఎస్బీ పల్లిలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. రంగు రంగుల పాత చీరలను సేకరించి పొలం చుట్టు కంచెను ఏర్పాటు చేశాడు. పంట చుట్టూ ఇలా చీరలను కట్టడం వల్ల జంతువులు దూరం నుంచి మనుషులు ఉన్నట్లుగా భ్రమించి బెదురుకుంటాయని రైతు రమేశ్ చెబుతున్నాడు.