Sabitha Indra Reddy : బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్

by Aamani |
Sabitha Indra Reddy : బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్
X

దిశ,ఆమనగల్లు(కడ్తాల్) : బంజారాల కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కడ్తాల్ మండలం గానుగుమర్ల తండాలో గిరిజనులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం నిర్వహించిన బంజారా తీజ్ పండుగ ఉత్సవాలలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ శ్రావణమాసంలో తొమ్మిది రోజుల పాటు గిరిజన యువతులు తమ సాంప్రదాయక పద్ధతుల్లో కుటుంబాలు, ఆవాసాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచారాలను, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. డప్పు వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో గిరిజన యువతులు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ సత్యం, పీఎసీఎస్ చైర్మన్ వెంకటేష్,మాజీ జడ్పీటీసీలు ఉప్పల వెంకటేష్,దశరథ్ నాయక్ రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి, పీఎసీఎస్ డైరెక్టర్ సేవ్య నాయక్,జోగు వీరయ్య, లయక్ అలీ, మాజీ ఎంపీపీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed